శ్రావణ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

శ్రావణ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవస్థానంలో శనివారం శ్రావణ అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వీర హనుమాన్ స్వామికి చందన పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్, వెంకటేశ్వర్లు, కోళ్ల సందీప్, పచ్చిమట్ల నరేశ్, సాంబ, కందుల అనిల్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.