జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

పలాస మున్సిపాలిటీ పరిధి పారసాంబ సమీపంలో ఉదయం జాతీయ రహదారిపై జీడిపిక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. రహదారిపై జీడిపెక్కల బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు.