ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
KNR: ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. మృతుడి తండ్రి వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉండే శివరాత్రి గణేశ్ (19) ఒంటరితనాన్ని భరించలేక జీవితంపై విరక్తి చెంది తన ఇంటి పక్కన ఉన్న ఆలకుంట్ల కర్రయ్య రేకుల షెడ్డులో ఎవరు లేని సమయంలో చీర సాయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.