'అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలి'

VZM: ప్రజలు ఇబ్బందులు, భద్రత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కొత్తవలస దేవరపల్లి, బానాది బల్లంకి డెక్ స్లాబ్ పనులకు నిధులు త్వరగా మంజూరు చేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టరేట్ కమిషనర్ వర్మకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి రాం ప్రసాద్, మాజీ జడ్పీటీసీ పాల్గొన్నారు.