మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే
ADB: ఆదిలాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ కొనుగోలు చేసిన నూతన జేసీబీని ఛైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన ప్రారంభించారు. మంచినీటి సమస్యల నివారణకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లాలా మున్న, సంజయ్, నరేష్, శ్రీకాంత్, మహబూబ్ కూడా పాల్గొన్నారు.