ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
TPT: తిరుమలలోని పాత పాపవినాశనం ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను శనివారం ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దళం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు.