పొన్నూరులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

GNTR: యూరియా, డీఏపీ ఎరువులు రైతులకు సక్రమంగా అందుతున్నాయా లేదా, అధిక ధరలకు అమ్ముతున్నారా, వేరే జిల్లాలకు తరలి వెళ్తున్నాయా అనే విషయాలపై పొన్నూరు మండలంలో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం సంయుక్తంగా తనిఖీలు చేశారు. GDCMS - నిడుబ్రోలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిడుబ్రోలు, పెదపాలెం గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.