VIDEO: 'వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి'
MHBD: బయ్యారం(M)కేంద్రంలోని రామాలయం ముందు ప్రధాన రహదారి అద్వానంగా మారింది. కొన్ని రోజులుగా గుంతల్లో నీరు నిలిచి, సరైన డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్డు పూర్తిగా బురదతో పేరుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు, డ్రైనేజ్ వ్యవస్థ పనులను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.