రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలపై MLA మదన్ మోహన్ వ్యవసాయ శాఖ అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యూరియా సరఫరా సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో మొక్కజొన్న పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.