రెండు సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్‌కు ఏకగ్రీవం
MHBD: గంగారం మండలంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ రెండు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఏకగ్రీవంగా చేరాయి. బుధవారం కొడిశెల మిట్ట పంచాయతీలో బచ్చల లక్ష్మణ్ రావు, జంగాలపల్లి పంచాయతీలో బానోత్ తార శ్రీను సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మొత్తం 12 పంచాయతీలలో రెండు ఏకగ్రీవాలు జరగడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పింది.