దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ

దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ

NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఎంపీ నిధుల ద్వారా మంజూరైన ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను తొమ్మిది మంది దివ్యాంగులకు అందజేశారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి దాదాపు రూ.10 లక్షల విలువైన ఈ వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.