ఉపాధ్యాయుడు ప్రేమ్‌లాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

NZB: జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రేమ్‌లాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. సెయింట్ మదర్ థెరెసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (విశాఖపట్నం) సంస్థ వారు గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందజేశారు. ఈసందర్భంగా తను విధులు నిర్వహిస్తున్న ముప్కాల్ మండల ప్రజాపరిషత్ స్కూల్ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.