నిరక్షరాస్యులకు పరీక్షలు

నిరక్షరాస్యులకు పరీక్షలు

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్లలో నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు ఉల్లాస్ పథకంలో భాగంగా ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 ఏళ్ల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. వారి సామర్థ్యాలను పరీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా 250 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పందిళ్లలో ఈ పరీక్షకు 20 మంది మహిళలు హాజరయ్యారు.