రేపటి నుంచి ఒంటిపూట బడులు
SKLM: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.