తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్నముప్పారం గ్రామానికి చెందిన సుధగాని నాగయ్య(43) రోజు మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉపేంద్ర, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. గీత కార్మికుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.