'ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

MHBD: న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సేవలను నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్ కుమార్ అన్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో ముందస్తుగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అయన పాల్గొన్నారు. ఈ నెలలో నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.