సీఆర్టీ ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేయాలి: వెంకటేశ్

MLG: ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో సీఆర్టీ ఉద్యోగాలను ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని తుడుందెబ్బ తాడ్వాయి మండల అధ్యక్షుడు వెంకటేశ్ ఇవాళ డిమాండ్ చేశారు. గతంలో జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసిన అధికారులు, పాత నోటిఫికేషన్ ప్రకారం వెరిఫికేషన్ చేస్తున్నారని, వెంటనే నిలిపివేయాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు.