జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ

VSP: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు, రేపు భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే 1800-4250-0009 నంబరుకు సంప్రదించాలని నగర ప్రజలను కోరారు.