పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
సత్యసాయి: ధర్మవరం, ఎన్‌పీ కుంట ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ధర్మవరం మారుతీ నగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.27,500 నగదు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఎన్పీ కుంట మండలం మందెంవారిపల్లి వద్ద జరిపిన దాడిలో ఇద్దరు పట్టుబడగా, ముగ్గురు పరారయ్యారని ఎస్సై కృష్ణమూర్తి పేర్కొన్నారు.