అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్

KNR: కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే పాలకవర్గ లక్ష్యమని మేయర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన పలు డివిజన్లలో పర్యటించి రూ. 42 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సప్తగిరి కాలనీలో రూ.38 లక్షలతో సైన్స్ ల్యాబ్, భాగ్యనగర్‌లో రూ. 4 లక్షలతో పైపులైన్ పనులను ప్రారంభించారు. ఈ మేరకు శివారు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మేయర్ అన్నారు.