VIDEO: మూఢనమ్మాల నిర్మూలనకే పోరాడుదాం: MNS
GDWL: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలను పారద్రోలి, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (MNS) రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం పేర్కొన్నారు. ఆదివారం గద్వాల జిల్లాలో ఎంఎన్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి దర్శన కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. దేశంలో మూఢనమ్మకాలను తొలగించడం మన లక్ష్యంగా ఉండాలన్నారు.