VIDEO: కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
GNTR: తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం ఓ మహిళ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న జాలర్లు గమనించి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ మహిళ విజయవాడలోని భవానీపురానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను పోలీసు స్టేషన్‌కు తరలించారు.