VIDEO: పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: జామి మండలం జట్టేడవలస జామిలో శనివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.