హోంగార్డులకు క్రీడా పోటీలు

హోంగార్డులకు క్రీడా పోటీలు

NRPT: హోంగార్డ్స్ రైజింగ్ డే పురస్కరించుకుని శుక్రవారం ఎస్పీ పరేడ్ మైదానంలో హోంగార్డులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్ తెలిపారు. కబడ్డీ, 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్ వంటి పోటీలు జరిగాయి. ఇందులో గెలుపొందిన వారికి శనివారం ఎస్పీ డాక్టర్ వినీత్ చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.