VIDEO: ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
BDK: భద్రాచలంలో రేపు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహొత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. రేపు నిదులా స్టేడియంలో కళ్యాణం కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ వేడుకలకు గవర్నర్, CM రానున్న నేపథ్యంలో సుమారు 2,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.