పెట్రోల్ బంక్‌లో ఆకస్మిక తనిఖీలు

కృష్ణా: భవానిపురం దర్గా వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఎస్.కె ఇంతియాజ్ పాషా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పెట్రోల్ బంక్‌లో కొలతలు, కొలమానాలు సరిగ్గా ఉన్నాయా లేవా, రోజువారీ సేల్స్ డైరీని పరిశీలించారు. పెట్రోల్ బంక్‌లో భద్రత పరిమాణాలను పరీక్షించారు. కస్టమర్లకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.