25ఏళ్లుగా బయట నో డిన్నర్: సల్మాన్ ఖాన్
తన వ్యక్తిగత జీవితంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సల్మాన్.. గత 25ఏళ్లలో తాను బయట డిన్నర్ చేయలేదన్నాడు. ఇల్లు, షూటింగ్ స్పాట్, ఎయిర్‌పోర్టులే ప్రపంచంగా మారాయని తెలిపాడు. అలాగే తన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ.. క్లోజ్ ఫ్రెండ్స్‌ను కొందరిని పోగొట్టుకున్నానని, ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారని ఎమోషనల్ అయ్యాడు.