మదనపల్లె మీదుగా అరుణాచలానికి ఎక్స్‌ప్రెస్ రైలు
అన్నమయ్య: ప్రతి మంగళవారం వేకువజామున మదనపల్లె మీదుగా అరుణాచలానికి ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు మదనపల్లె రైల్వేస్టేషన్ మేనేజర్ జాబీర్బాషా తెలిపారు. 17615 నంబరు గల రైలు కాచిగూడ నుంచి తూత్తుకూడికి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరుతుందని, సీటీఏం రైల్వేస్టేషన్‌కు మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు వస్తుందన్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.