ప్రజల ఆరోగ్యం మా బాధ్యత : ఎమ్మెల్యే
MBNR: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం తమ బాధ్యత అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువుల తల్లులకు హెల్త్ కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ ఆసుపత్రిలో శిశువుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.