మామిడి రైతుల కోసం రూ.130 కోట్లు: పెమ్మసాని

GNTR: మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం జరిగిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.260 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అయితే అందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా రూ.130 కోట్లు భరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు.