ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తత్కాల్ అవకాశం

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తత్కాల్ అవకాశం

WGL: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాలకు తత్కాల్ స్కీం కింద మరోసారి అవకాశం కల్పించినట్లు HNK డీఈవో గిరిరాజ్ గౌడ్, ఉమ్మడి WGL జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సదానందం తెలిపారు. అపరాధ రుసుంతో ఈ నెల15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. TOSS వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.