లారీ ఢీకొని.. ఆవు మృతి

NLR: ఉదయగిరి పట్టణంలో గండిపాలెం మార్గంలో సెయింట్ మేరీ స్కూల్ వద్ద సోమవారం ఉదయం ఓ లారీ ఢీకొని ఆవు మృతి చెందింది. రాజమండ్రి నుంచి మొక్కలు సరఫరా చేసి తిరిగి వెళ్తున్న లారీ రోడ్డుపై ఆవు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆవు యజమాని తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.