కాలనీలే పట్టణానికి పట్టు కొమ్మలు: మాజీ మున్సిపల్ ఛైర్మన్

కాలనీలే పట్టణానికి పట్టు కొమ్మలు: మాజీ మున్సిపల్ ఛైర్మన్

MBNR: కాలనీలే పట్టణానికి పట్టు కొమ్మలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. పురపాలక పరిధిలోని శ్రీరామ కాలనీ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.