'ప్రజల రక్షణ కోసమే చట్టాలు'

KNR: ప్రజల రక్షణ కోసమే చట్టాలు ఉన్నాయని తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా సమానమేననీ, పౌర హక్కులకు భంగం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.