'గుంతకల్లులో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి'

'గుంతకల్లులో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి'

ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ బుధవారం హమాలీ ఆఫీసు రోడ్డు, బీరప్ప సర్కిల్ రోడ్డు, ట్రావెల్స్ బంగ్లా రోడ్డులను సందర్శించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేసి, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.