'వెంకయ్యపాలెం విద్యార్థులకు 3 కి.మీ నరకయాతన'
ASR: అనంతగిరి మండలం వెంకయ్యపాలెంలో పాఠశాల లేక 35-40 మంది పిల్లలు చదువు కోసం 3 కి.మీ ప్రమాదకర ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదాలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాన్ని సందర్శించిన సీపీఎఫ్ అధ్యక్షుడు అభినయ్ దర్శన్, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామానికి స్కూల్ సాధిస్తామని హామీ ఇచ్చారు.