శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ సాయం చేస్తోంది. తమ వంతు సాయంగా ఆ దేశానికి ఆహారం, వైద్య సామాగ్రి, అత్యవసర సదుపాయాలను అందిస్తోంది. ఇందులో భాగంగా శ్రీలంకకు ఇప్పటివరకూ 53 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను సరఫరా చేసింది. మరోవైపు మొదటి దఫా సాయంగా తొలివిడత సామాగ్రిని పంపించామని, సహాయక చర్యలు కొనసాగుతాయని భారత ఎంబసీ ప్రకటించింది.