శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

సత్యసాయి: గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో సర్పంచ్ శివానంద, నంజుండప్ప ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శంకర్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.