గణేశ్ నిమజ్జనంలో పోలీసుపై దాడి

KRNL: ఆదోని మండలం పెసలబండ గ్రామంలో సోమవారం రాత్రి గణేశ్ నిమజ్జనంలో పోలీసులపై దాడి జరిగింది. బెస్తసూరి అనే యువకుడు కానిస్టేబుల్ షేక్ సాబ్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆదోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్సలో తలకు ఐదు కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై సీఐ నల్లప్ప దర్యాప్తు చేపట్టారు.