జిల్లాలో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి

జిల్లాలో  ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి

భద్రాద్రి: వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈఈ, డీఈఈలు, పబ్లిక్ హెల్త్ డీఈఈలు, ఎంపిడీవోలు, ఎంపివోలు, స్పెషల్ ఆఫీసర్లతో త్రాగునీరు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. త్రాగునీటి కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.