'రెబ్బెన PHCని CHCగా అప్‌గ్రేడ్ చేయాలి'
ASF: రెబ్బెన PHCని CHCగా అప్‌గ్రేడ్ చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రెబ్బెనతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు కలిపి సుమారు లక్ష మంది PHCపై ఆధారపడుతున్నారని తెలిపారు. IPHS నిబంధనల ప్రకారం 50,000 జనాభాకు ఒక CHC ఉండాలని గుర్తు చేశారు.