భార్యపై అలిగి చేయికోసుకున్న వ్యక్తి

WG: భార్యపై అలిగి ఒక వ్యక్తి చేయి మణికట్టుపై కోసుకున్న ఘటన మొగల్తూరులో చోటు చేసుకుంది. మొగల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు ఆమె భర్త ఉమా శివకాంత్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉమాశివకాంత్ బ్లేడుతో చేయి కోసుకున్నాడు. సమాచారం అందుకున్న అత్యవసర వాహన సిబ్బంది అతడిని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.