రేపు GVMCలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
VSP: డిసెంబర్ 1 సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనున్నట్టు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం ఓ ప్రకటనలొ తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల సమస్యలను అర్జీల ద్వారా వినతి పత్రాల రూపంలో ప్రజలు ఇవ్వవచ్చని అధికారులు పేర్కొన్నారు.