'రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
VZM: రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. జామి మండలంలోని శిరికిపాలెంలో బుధవారం నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు.