టంగుటూరులో పట్టపగలే దొంగతనం

KDP: రాజుపాలెం మండలం టంగుటూరులో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. ఓ దొంగ ఇంటిలోకి చొరబడి యజమానిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని దేహ శుద్ధి చేశారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, దొంగ స్థానికుల అదుపులో ఉన్నాడు. అతనిని కట్టేసి బంధించారు.