VIDEO: లారీ బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం
MLG: తాడ్వాయి–కొండపర్తి మధ్య 163 జాతీయ రహదారిపై వడ్ల లారీ బోల్తాపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లారీ నుంచి వడ్ల బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న తాడ్వాయి పోలీసులు జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించారు.