నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి పట్టణంలో పలు ప్రాంతాలకు మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు వైర్లు మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మల్ల వీధి, రైల్వే స్టేషన్ రోడ్డు, వేల్పుల వీధి కళ్యాణమండపం, వుడ్ పేట లోకావారి వీధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.