వడ్డాది సర్కిల్‌లో శుక్రవారం పవర్ కట్

వడ్డాది సర్కిల్‌లో శుక్రవారం పవర్ కట్

వడ్డాది సెక్షన్ పరిధిలోని డీఆర్డీఓ, ఆయిల్ ఫామ్ ఫీడర్లలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని నర్సీపట్నం డీఈ ఏవీఎన్ అప్పారావు అన్నారు. మరమ్మతులు, చెట్టు కొమ్మల తొలగింపు పనుల కోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ చేస్తునట్లు తెలిపారు. బంగారుమెట్ట కూడలి గృహాలు, లోపూడి, బంగారుమెట్ట పరిశ్రమలు, పెట్రోల్ బంకులకు విద్యుత్ అంతరాయం ఉంటుందిన్నారు.