దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే
MBNR: రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోళ్ళు కేంద్రాలలోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సూచించారు. రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో వరి, మక్కా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు.