గ్రీవెన్స్ కార్యక్రమానికి 7 ఫిర్యాదులు

గ్రీవెన్స్ కార్యక్రమానికి 7 ఫిర్యాదులు

ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండలస్థాయి గ్రీవెన్స్‌లో 7 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, తహసీల్దార్ పీ.మురళీ బాబు తెలిపారు. రేషన్ సమస్యలపై-2, భూమి పట్టా విభజన కోసం-1, పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలపై-2, మ్యుటేషన్లకు సంబంధించి-2 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.